అవును మన రాష్ట్రం నెంబర్ – 1: జగన్
రాష్ట్రం నెంబర్ 1 అని చంద్రబాబు అంటున్నారని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు రాష్ట్రాన్ని నెంబర్ 1 చేశాడని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ [more]
రాష్ట్రం నెంబర్ 1 అని చంద్రబాబు అంటున్నారని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు రాష్ట్రాన్ని నెంబర్ 1 చేశాడని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ [more]
రాష్ట్రం నెంబర్ 1 అని చంద్రబాబు అంటున్నారని, వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు రాష్ట్రాన్ని నెంబర్ 1 చేశాడని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పాడేరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘మద్యం అమ్మకాల్లో, పెట్రోల్ రేట్లలో, రైతుల ఆత్మహత్యల్లో, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యల్లో, ఫీజుల పెంపులో, మహిళల మీద నేరాలు చేసిన మంత్రుల్లో, పార్టీ ఫిరాయింపుల్లో, ప్రతిపక్షాల నాయకులను చంపించడంలో, ప్రతిపక్షాల వారిపై కేసులు పెట్టడంలో, టీడీపీ నేతలపై కేసులు ఎత్తేయడంలో, గుడి భూములు మింగడంలో, ఓటుకు కోట్లిస్తూ దొరికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడంలో, రాష్ట్ర ఆస్తులను వదులుకోవడంలో, ప్రత్యేక హోదా అడిగితే కేసులు పెట్టడంలో, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడంలో, భూదందాల్లో, ఆక్రమణల్లో, కుంభకోణాల్లో, ఇసుక, మట్టి, బొగ్గు, రాజధాని భూములు, విశాఖ భూములు, దళితుల భూములు దోచేయడంలో రాష్ట్రం ఇప్పుడు నెంబర్ 1లో ఉంది’’ అని జగన్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.
నవరత్నాలతో సమూల మార్పు
మీడియా మేనేజ్ మెంట్ లో, వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ చంద్రబాబు నెంబర్ 1 అని అన్నారు. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు చేస్తూ ఐదేళ్లు పాలించిన చంద్రబాబు ఇప్పుడు ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటున్నారు. ఇటువంటి పాలన అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని అన్నారు. తన పాలనను చూసి ఓట్లు అడిగే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు మాటలకు మోసపోవద్దని, వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే నవరత్నాలతో ప్రజల జీవితాల్లో సమూల మార్పులు వస్తాయన్నారు.