ఈ గవర్నర్ కామలీలలు విన్నారా?

Update: 2017-01-27 03:55 GMT

మేఘాలయ గవర్నర్ షణ్ముగనాధన్ రాజీనామా చేశారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన షణ్ముగనాధన్ ను 2015లో బీజేపీ సర్కార్ గవర్నర్ గా నియమించింది. షణ‌్ముగనాధన్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఉద్యోగానికి వచ్చిన యువతిపై రాజ్ భవన్ లో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని విమర్శలు వచ్చాయి. ఆ యువతి కూడా మీడియా ముందుకొచ్చింది. ఒక జాతీయ ఛానెల్ లో ప్రసారం కూడా అయింది.

అయితే రాజ్ భవన్ కు చెందిన దాదాపు 98 మంది ఉద్యోగులు రెండు రోజుల క్రితం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. 67 ఏళ్ల వయస్సున్న షణ్ముగనాధన్ రాజ్ భవన్ ను రాసలీలకు అడ్రస్ గా మార్చారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద సిబ్బందిని యువతులనే ఎంచుకుంటున్నారని రాజ్ భవన్ సిబ్బంది చెబుతున్నారు. మోడీకి, హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ క్ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో హోంమంత్రి కార్యాలయం నుంచి గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని సంకేతాలు అందడంతో గవర్నర్ షణ్ముగ నాధన్ రాజీనామా చేశారు. గతంలో ఇవే ఆరోపణలు ఏపీ గవర్నర్ ఎన్ డి తివారీపై కూడా వచ్చాయి.

Similar News