చిన్నమ్మపై అశ్విన్ గూగ్లీ

Update: 2017-02-06 09:30 GMT

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి పీఠం ఎక్కక ముందే అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. సెలబ్రీటీలు కూడా చిన్నమ్మపై నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తుండటం విశేషం. సొంత పార్టీ నేతలతో పాటు బయట వారు కూడా సోషల్ మీడియా వేదికగా చిన్నమ్మపై సెటైర్లు వేసేస్తున్నారు. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండే లెగ్ స్పిన్నర్ అశ్విన్ చిన్నమ్మపై గూగ్లీ విసిరారు. ‘తమిళనాడులో యువకులందరికీ శుభవార్త వస్తుంది. త్వరలోనే రాష్ట్రంలోని యువకులందరికీ 234 ఉద్యోగాలు వస్తాయి. ’ అని సెటైర్ వేసేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 అసెంబ్లీ స్థానాలున్నాయి. చిన్నమ్మ సీఎం అయితే మళ్లీ ఎన్నికలు రావడం ఖాయమన్నట్లు పరోక్షంగా అశ్విన్ ట్వీట్ చేశారు.

మరోవైపు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కూడా చిన్నమ్మ ఎంపికపై రెస్పాండ్ అయ్యారు. తమిళనాట రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయన్నారు. గతంలో తమిళనాడులో రాజకీయం గర్వంగా చెప్పుకునేదిలా ఉండేదని, ఇప్పుడలా లేదని అన్నారు. తమిళ ప్రజలు, ప్రజాప్రతినిధులు గత పరిస్థితులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో కామరాజ్ నాడార్, అన్నాదురై లాంటి వాళ్లు తమిళనాడుకు సీఎంగా పనిచేయడం గర్వంగా ఉందని, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిగా పదవి చేపడుతున్న వ్యక్తి అర్హతలను తెలుసుకోవడం ప్రజల హక్కని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా చిన్నమ్మను దృష్టిలో పెట్టుకుని చేసిందే. ఎమ్మెల్యే అండతో సీఎం అయినప్పటికీ... ప్రజలు జయలలితను చూసే ఓటేశారని, శశికళను చూసికాదని సోషల్ మీడియాలో వేల సంఖ్యలో పోస్టులు కన్పిస్తున్నాయి.

ఇదిలా ఉండగా అన్నాడీఎంకే నుంచి సస్పెండ్ అయిన శశికళ పుష్ప చిన్నమ్మ నియామకంపై ఏకంగా ప్రధాని మోడీకే లేఖ రాశారు. నేర చరిత్ర ఉన్న శశికళను ఎలా సీఎం చేస్తారని ప్రశ్నించారు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ సహ నిందితురాలిగా ఉన్నారని, శశికళ సీఎం అయితే రాజకీయ వ్యవస్థే భ్రష్టుపట్టి పోతుందని ఆమె ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు

Similar News