జయ విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చారు

Update: 2017-02-06 12:00 GMT

మాజీ ముఖ్యమంత్రి జయలలితను విషమ పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకొచ్చారని లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే చెప్పారు. జయలలిత మరణం వెనుక కుట్ర ఏమీ లేదన్నారు. అపోలో వైద్యులతో కలసి రిచర్డ్ బాలే జయ మరణంపై ఉన్నఅనుమానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. తాను కేవలం వైద్య సంబంధమైన ప్రశ్నలకే సమాధానమిస్తానన్న బాలే రాజకీయపరమైన ప్రశ్నలకు సమాధానమివ్వలేనన్నారు. జయ శ్వాస సంబంధమైన ఇబ్బందులతో అపోలో ఆసుపత్రిలో చేరారన్నారు. ఆమె రక్తంలోనూ, మూత్రంలోనూ ఇన్ ఫెక్షన్ ఉందని, రక్తంలో బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నట్లు బాలే చెప్పారు.

రక్తంలో ఇన్ ఫెక్షన్....

ఇన్ ఫెక్షన్ మూలంగా జయ శరీరంలోని అవయవాలు దెబ్బతిన్నాయని, అయితే సాధ్యమైనంత వరకూ జయను బతికించడానికి ప్రయత్నించామన్నారు. బీపీ సమస్య కూడా తీవ్రంగా ఉండటంతో వైద్యపరమైన ఇబ్బందులు తలెత్తాయన్నారు. జయ ఆస్పత్రికి వచ్చినప్పుడు చికిత్సకు చక్కగా స్పందించారని, అయితే గుండెపోటు రావడంతో జయ మరణించారని బాలే తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన వారం రోజుల తర్వాత ఆమె అందరితోనూ మాట్లాడగలిగారని కూడా చెప్పారు. జయ మరణం వెనక కుట్ర ఏమీ లేదని తేల్చి చెప్పారు. జయ మరణంపై వెల్లువెత్తుతున్న అనుమానాలను

ప్రజలకు తెలిపేందుకు తమిళనాడు ప్రభుత్వం డాక్టర్ బాలేను లండన్ నుంచి ప్రత్యేకంగా రప్పించింది.

Similar News