ట్వీట్లతో దుమ్ము లేపుతున్న పవన్

Update: 2017-01-26 10:23 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ యూత్ చేపట్టిన ఆందోళనకు విశాఖకు వెళ్లకున్నా ట్వీట్లతోనే తన నిరసన తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో పోరుకు దిగారు. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకుంటే.. కోడి పందేలు, పందుల పందేలు ఆడుకోవాలని కేంద్రమంత్రి సృజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. సుజనా చౌదరి వ్యాఖ్యలకు తనకు బాధ కల్గించాయన్నారు పవన్. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని పందుల పందేలతో పోల్చడం విచారకరమన్న పవన్....మీరు నోరు జారే కొద్దీ యువతను రెచ్చగొట్టినట్లేనని...సరే..అలాగే కానివ్వండి అని పవన్ ట్వీట్ చేశారు.

అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపైనా పవన్ ట్విట్టర్లలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టొద్దని రాయపాటికి సూచించారు. రాయపాటి గారూ ఒకసారి ఆలోచించుకోండి అని అన్నారు. మీ లాంటి వారి వల్లనే తెలంగాణలో ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారు అనే అపవాదును తెలుగు జాతి మొత్తం పొందాల్సి వచ్చిందన్నారు. విభజనకు ముందు పంచభక్ష్య పరమాన్నాలతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి పాచిపోయిన లడ్డూలు చేతిలో పెడతారా? అంటూ ప్రశ్నించారు. భావి తరాల భవిష్యత్తును పాడు చేసే హక్కు మీకు లేదని పవన్ దుయ్యబట్టారు.

Similar News