పన్నీర్ సెల్వం రాజీనామా... సీఎంగా శశికళ!

Update: 2017-02-05 11:08 GMT

అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అన్నా డీ ఎం కే లో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహాగానాలకు తెరతీస్తూ.. తమిళనాడు సీఎంగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనసభపక్ష సమావేశంలో తమ నేతగా శశికళ పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నానని పన్నీర్ సెల్వం ప్రకటించారు.

మరో వైపు శశికళ ముఖ్యమంత్రి పదవి చేపడతారనే వార్తలపై జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మండిపడ్డారు. తమిళనాడు ప్రజలకు ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదని వ్యాఖ్యానించారు. అధికారాన్ని చేపట్టేందుకు శశికళ బృందం మిలటరీ తరహా కుట్రకు పాల్పడుతోందంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. మరోవైపు అన్నాడీఎంకేలో పరిణామాలను డీఎంకే, ఇతర పార్టీలు ఆశక్తితో గమనిస్తున్నాయి. శశికళ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శశి పేరును సీఎం పన్నీర్ సెల్వం ప్రతిపాదించారు. దీంతో శశికళ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమం అయినట్లే. ఈనెల 9 లేక 10న శశికళ సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఈ నెల 9న తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చేస్తారని అన్నాడీఎంగా వర్గాలు చెబుతున్నాయి.

Similar News