మూడే మూడు విషయాలంటున్న పవన్!

Update: 2016-08-27 11:51 GMT

మొదలైన పవన్ బహిరంగ సభ. సభలో మాట్లాడుతున్న పవన్.... నాకు ఏ హీరోలతో విభేదం లేదు.హీరోలందరం కలిసి అన్నదమ్ముల ఉంటామని.... నేను అందరితో ఒకేలా ఉంటానని అన్నాడు పవన్. మూడే మూడు విషయాలు మాట్లాడడానికి ఈ సభ పెట్టానని ఆ మూడు విషయాలూ.... ఒకటి వినోద్ హత్య గురించి, రెండోది ఏపీ ప్రభుత్వ పరిపాలన తీరు గురించి, మూడోది స్పెషల్ స్టేట్స్ గురించి. నాకు సినిమాలపై వ్యామోహం లేదని..... అభిమానం ఉండాలిగాని.... అది చంపుకునేంత ఉండకూడదని అన్నాడు. వినోద్ హత్య నన్ను కలిచి వేసిందని అతని తల్లి బాధ వర్ణనాతీతం అని.... ఆమెకి పాదాభి వందనం చేస్తున్నానని అన్నాడు. రాజకీయ పదవులపై నాకు ఎలాంటి మొహం లేదని.... నేను కులాల గురించి మాట్లాడని తెగేసి చెప్పాడు. కుల రాజకీయం తగదని చెప్పుకొచ్చాడు. ప్రత్యేక హోదా మీద జాప్యం చేస్తున్న కేంద్రాన్ని చాలా అడగాలని చెప్పారు. బిజెపి పై నాకు అభిమానం ఉందని కానీ ఇలా ప్రత్యేక హోదాపై తాత్సారం చెయ్యడం నచ్చలేదని చెప్పాడు. జనసేన పార్టీ ని నేను ప్రజలకోసమే నడుపుతున్నానని... నేను ఎవరి పక్షం కాదని.... నేను ప్రజల పక్షాన పోరాడడానికి జనసేన ని పెట్టానని చెప్పాడు. జనసేన ఎవరి జెండా మోయదని... ప్రజల అజండా కోసమే పని చేస్తుందని చెప్పారు. టిడిపి, బిజెపికి నేను భుజం కాశాను. వారికి నేను చేతనైనంత సహాయం చేశానని చెప్పారు. అమిత్ షా నన్ను బిజెపిలోకి రమ్మని ఆహ్వానించారు. కానీ నేను తెలుగు రాష్ట్రాల కోసమే పార్టీ పెట్టానని ఆ ఆఫర్ ని సున్నితం గా తిరస్కరించానని చెప్పారు. అయితే ప్రత్యేక హోదా విషయం లో బిజెపి పెద్ద తప్పు చేసిందని చెప్పారు. రాష్ట్రాన్ని విడగొట్టి కాంగ్రెస్ ఎంత తప్పు చేసిందో... బిజెపి కూడా ప్రత్యేక హోదా విషయం లో అంతే తప్పు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఇచ్చిన మాట తప్పితే ప్రజల ఆగ్రహం, కక్షని చవిచూడాల్సి వస్తుందని హితవు పలికారు. ఏది ఏమైనా బిజెపిని మాత్రం ప్రశ్నల వర్షం లో తడిపేస్తున్నాడు పవన్.

Similar News