రైలు ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక నిధి

Update: 2017-02-01 11:30 GMT

అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో రైల్వేను కూడా కలిపేయడం ఈ బడ్జెట్ ప్రత్యేకత. అయితే ఈసారి రైల్వేశాఖకు 1.31,000 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. రైల్వే శాఖ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పిన జైట్లీ ప్రయాణికుల భద్రతకు కూడా పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలతో రైల్వే భద్రత నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నిధిని ప్రయాణికుల భద్రత కోసం వినియోగిస్తామన్నారు. 2019 నాటికి అన్ని రైళ్లలో బయో టాయ్ లెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశంలోని ఏడు వేల రైల్వే స్టేషన్లలో సోలార్ పవర్ ను నెలకొల్పుతామని చెప్పారు.

కొత్త రైళ్లు...లైన్లు...

ఈ ఏడాది కొత్తగా దేశంలో 3,500 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం చేపడతామని అరుణ్ జైట్లీ చెప్పారు. ఆధ్యాత్మిక, పర్యాటక రంగాలకు కొత్త రైళ్లను ప్రవేశపెడతామని ఆర్థికమంత్రి చెప్పారు. నూతన మెట్రో రైల్వే విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఐఆర్ఠీసీ ద్వార టిక్కెట్ బుక్ చేసుకుంటే సర్వీస్ ట్యాక్స్ ఉండదని జైట్లీ చెప్పారు. వికలాంగులకు అనుకూలంగా ఉండేలా 700 రైల్వేస్టేషన్లలో సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Similar News