విశాఖలో టీడీపీ vs బీజేపీ డిష్యూం..డిష్యూం...

Update: 2017-01-25 07:41 GMT

విశాఖపట్నంలో భూముల వివాదం మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టింది. ఇద్దరు ఎమ్మెల్యేల మద్య వైరాన్ని పెంచింది. బీజేపీ, టీడీపీ ల మధ్య గ్యాప్ పెంచింది. విశాఖ పట్నంలోని ముదిపాక గ్రామంలో ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ కింద తీసుంటున్నట్లు కొందరు బలవంతంగా రైతుల చేత సంతకాలు చేయించుకున్నారు. ఈ రైతులందరూ కలసి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. బలవంతంగా తమ భూములను లాక్కుంటున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో విష్ణుకుమార్ రాజు రంగంలోకి దిగారు. విష్ణుకుమార్ రాజు ఉన్నతాధికారులను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. రైతుల భూములను బలవంతంగా ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు.

ఆయన జోక్యమేమిటి?

మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానారయణమూర్తి నియోజకవర్గమది. నా నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు ఎలా వేలు పెడతారని బండారు ప్రశ్నిస్తున్నారు. ఆయన జోక్యం సరికాదని చెబుతున్నారు. మిత్రపక్షమై ఉండి సమస్యపై తనను సంప్రదించి ఉంటే బాగుండేదని బండారు అభిప్రాయపడ్డారు. ల్యాండ్ పూలింగ్ కింద రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటున్నామని బండారు వివరణ ఇచ్చారు. గ్రామం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం తాము ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చామని చెబుతుంటే.. మరొక వర్గం మాత్రం తమ నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని చెబుతోంది.ఇప్పటికే కొందరు రైతుల దగ్గర భూములు తీసుకున్నారు. వారికి ఎకరాకు పదిలక్షలు ఇస్తామని చెప్పి కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని చెబుతున్నారు. దీంతో రైతులు రోడ్డెక్కారు. అసలు భూ వివాదంలో ఎమ్మెల్యేకేం పని? ప్రభుత్వ అవసరాల కోసమే అయితే రెవెన్యూ అదికారులు చూసుకుంటారు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ భూవివాదంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వివాదం ఎటువైపు దారి తీస్తుందో మరి.

Similar News