Corona Virus : విశాఖలో తొలి కోవిడ్ మరణం
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. విశాఖలో కరోనాతో మహిళ మృతి చెందడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ ఇరవైకి పైగా కేసులు నమోదవుతున్నాయి. విశాఖలో కరోనాతో మహిళ మృతి చెందడంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. అనారోగ్యంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో చేరిన 51 ఏళ్ల మహిళ కరోనా బారిన పడి మృతి చెందడం కలకలం రేపింది. దీంతో కరోనా వైరస్ మరోసారి చుట్టేసిందన్న భయాందోళనల్లో ప్రలు ఉన్నారు. అయితే కరోనా వైరస్ తో పాటు ఆ మహిళ దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుండటం వల్లనే మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు.
11 కేసులు నమోదు...
విశాఖలో ఇప్పటి వరకూ 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఒకరు మృతి చెందారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు. మాస్క్ లు ధరించి బయటకు రావడంతో పాటు దీర్ఘకాలిక రోగులు, సీనియర్ సిటిజన్‌లు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలున్న వారు మాత్రమే ఈసారి మరణిస్తున్నారని వైద్యులు చెబుతుండటం విశేషం.