అరకు వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్
అరకు పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి ప్రత్యేక రైలు నడపనుంది.
అరకు పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తూర్పు కోస్తా రైల్వే విశాఖ నుంచి ప్రత్యేక రైలు నడపనుంది. ఈ మేరకు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలు దేరి ఉదయం 11.45 గంటలకు అరకు చేరుకోనున్నట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో అదే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటలకు బయలు దేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకోనుంది.
ప్రత్యేక రైలు...
ఒక సెకెండ్ ఏసీ, ఒక థర్డ్ ఏసీ, 10 స్లీపర్ క్లాస్, 4 సాధారణ రెండో తరగతి, 2 సాధారణ కమ్ లగేజీ బోగీలతో ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా గుహలు మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు తెలిపారు. పర్యాటకులు గమనించి ఈ రైలు సేవలు వినియోగించుకోవాలని కోరారు. పర్యాటకులు ఎక్కువ మంది రైలు ప్రయాణాన్ని కోరుకుంటారని, అందుకే ప్రత్యేక రైలును నడుపుతున్నామని అధికారులు తెలిపారు.