విశాఖ సెంట్రల్ జైలు అధికారుల సంచలన నిర్ణయం
విశాఖ సెంట్రల్ జైలు ఉన్నతాధికారుల సంచలన నిర్ణయం తీసుకున్నారు.;
విశాఖ సెంట్రల్ జైలు ఉన్నతాధికారుల సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలు సిబ్బందిని ఏకబిగిన అరవై ఆరుమందిని బదిలీ చేశారు. ఒక్కసారిగా ఇంతమందిని బదిలీ చేయడం ఇదే తొలిసారి. అయితే విశాఖ సెంట్రల్ జైలు ఎదుట ఇటీవల సిబ్బంది కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ వారిని బట్టలు విప్పిస్తున్నారని, సరైన సమయంలో డ్యూటీలు వేయడం లేదని నిరసనకు దిగారు.
66 మంది పై బదిలీ వేటు...
దీంతో దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశంచింది. ఈ వివాదంలో 66మందిపై బదిలీ వేటు పడింది. వార్డర్స్,హెడ్‌వార్డర్స్‌ను బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విశాఖ సెంట్రల్ జైలు ఎదుట ఆందోళన చేసినందుకు చర్యలు తీసుకున్నారు. ఖైదీలతో వార్డర్స్ బట్టలు విప్పించి చెక్ చేశారని నిన్న కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలియజేయడంతో 37మంది వార్డర్స్‌తో కలిపి 66 మందిపై బదిలీ వేటు పడింది.