విశాఖ రిఫైనరీని 26 వేల కోట్లతో ఆధునికీకరణ
విశాఖలోని హెచ్‌పీసీఎల్ ను ఆధునికీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
విశాఖలోని హెచ్‌పీసీఎల్ ను ఆధునికీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చంది. హెచ్‌పీసీఎల్ ను 26,264 కోట్ల రూపాయలతో విస్తరించనున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి రామేశ్వర్ తెలిపారు. దీనికి హెచ్‌పీసీఎల్ కూడా అంగీకారం తెలిపిందని మంత్రి తెలియజేశారు. విస్తరణ పూర్తయితే ప్రస్తుతం హెచ్‌పీసీఎల్ సామర్థ్యం 83. మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నుల కు పెరుగుతుందని చెప్పారు.
లక్షలాది మందికి....
కాగా ఈ ప్రాజెక్టు విస్తరణతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. హెచ్‌పీసీఎల్ చరిత్రలో ఈ స్థాయిలో విస్తరణ జరగడం ఇదే మొదటి సారి అని పేర్కొన్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆధునికీకరణ కోసం స్థానిక ఉత్పత్తులనే ఉపయోగించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన తెలిపారు.