ఈ అధికారి ఆస్తులు తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే.. ఏసీబీ సెర్చింగ్ ఎఫెక్ట్

హనుమకొండ డీటీసీ పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు;

Update: 2025-02-07 07:20 GMT
satish reddy,  electricity department ade, acb,  gachibowli
  • whatsapp icon

హనుమకొండ డీటీసీ పుప్పల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణ నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే లెక్కకు మించిన ఆస్తులున్నట్లు ఏసీబీ సోదాల్లో వెల్లడయినట్లు తెలిసింది. యాభై కోట్ల రూపాయల మేరకు పైగా ఆస్తులను శ్రీనివాస్ కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో వెల్లడయింది.

బంధువుల ఇళ్లలో...
హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. పక్క సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. సోదాల సందర్భంగా నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News