Tiger : పులి అక్కడకు వచ్చి వెళ్లిందట
తెలంగాణలో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది;
తెలంగాణలో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పులి తిరుగుతున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. అటవీశాఖ అధికారులు కూడా నిర్ధారించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నల్లబిల్లి, గంగారం, నర్సంపేట అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడే అది తిరుగుతుందని చెప్పారు.
పాదముద్రల ఆధారంగా...
ఇదే సమయంలో పులి రుద్రగూడెం సమీపంలోకి వచ్చివెళ్లిన విషయాన్ని స్థానికులు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని తెలియజేశారు. దీంతో అధికారులు పులి పాదముద్రలను ఆధారంగా గుర్తించారు. ఎవరూ ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని, రాత్రి వేళ సంచరించవద్దని ఆ ప్రాంత గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులు డ్రోన్ కెమెరాలో పులి జాడను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.