Medaram : నేటి నుంచి మేడారం మినీ జాతర
దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం మళ్లీ ముస్తాబయింది. నేటి నుంచి మేడారం మినీ జాతర ప్రారంభం కానుంది;

దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర అయిన మేడారం మళ్లీ ముస్తాబయింది. నేటి నుంచి మేడారం మినీ జాతర ప్రారంభం కానుంది. సమ్మక్క, సారలమ్మల మినీజాతర కోసం అధికారులు అన్ని ఏర్పా్టలు చేశారు. ఈరోజు నుంచి పదిహేనో తేదీ వరకూ సమ్మక్క సారలమ్మ మినీ జాతర జరుగుతుంది. మామూలుగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది.
ఇతర రాష్ట్రాల నుంచి...
మధ్యలో ఏడాది మాత్రం మినీ జాతరను నిర్వహిస్తుండటం సంప్రదాయంగా వస్తుంది. ఈరోజు మెండిమెలిగే పండగతో మినీ జారత ప్రారంభమవుతుంది. మినీ జాతర కోసం ప్రభుత్వం 5.30 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.