ఇదే BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు 2022 షెడ్యూల్
ఇదే BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు 2022 షెడ్యూల్
బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లలో BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఇది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) ద్వారా నిర్వహించబడుతోంది. ఈ టోర్నమెంట్ లో ముందుకు వేసే ఒక్కో అడుగు.. క్రీడాకారులకు అత్యధిక ర్యాంకింగ్ పాయింట్లను అందిస్తుంది. ఈ ఏడాది BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ జపాన్‌లోని టోక్యోలో ఆగస్టు 22 నుండి 28 వరకు జరగనుంది. 46 దేశాల నుండి మొత్తం 364 మంది అథ్లెట్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇక జపాన్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి.
2022 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మొత్తం ఐదు ఈవెంట్‌లు ఆడనున్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్.. ఇలా ఉన్నాయి. ఇక ఈవెంట్‌లు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో నిర్వహించనున్నారు. ఇక ప్రతి ఈవెంట్‌లో క్వార్టర్స్, సెమీస్ మరియు ఫైనల్స్‌తో సహా ఆరు రౌండ్లు ఉంటాయి. మొదటి రెండు రోజులు, ఆగస్టు 22, 23 తేదీల్లో మొదటి రౌండ్ మ్యాచ్‌లు, ఆగస్టు 24న రెండో రౌండ్ మ్యాచ్‌లు, 25న మూడో రౌండ్ మ్యాచ్‌లు జరుగుతాయి. క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్ , ఫైనల్ వరుసగా ఆగస్టు 26, 27, మరియు 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఒక్కో ఈవెంట్‌లో ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, 10 కాంస్యాలు చొప్పున మొత్తం 20 పతకాలు ఉంటాయి.
BWF 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్ షెడ్యూల్
ఆగస్టు 22- ఆగస్టు 23: మొదటి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి (05:30 AM IST)
ఆగస్టు 24: రెండవ రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి (05:30 AM IST)
ఆగస్టు 25: మూడో రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి (06:30 AM IST)
ఆగస్ట్ 26: క్వార్టర్ ఫైనల్స్ ప్రారంభం (06:30 AM IST)
ఆగస్టు 27: సెమీ ఫైనల్స్ ప్రారంభం (06:30 AM IST)
ఆగస్ట్ 28: ఫైనల్స్ ప్రారంభం (11:30 AM IST)