ఒకప్పుడు మూడేళ్లకు ఒకసారి.. ఇప్పుడు ప్రతీ ఏడాది BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్

ప్రతీ ఏడాది BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్.. ఒకప్పుడు మూడేళ్లకు;

Update: 2022-08-17 06:02 GMT

BWF వరల్డ్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో ఆడాలని.. పతకాలను సాధించాలని ప్రతి ఒక్క బ్యాడ్మింటన్ క్రీడా కారులు కలలు కంటూ ఉంటారు. ఈ టోర్నమెంట్ లో టైటిల్ సాధించడం ద్వారా ఒక్కసారిగా స్టార్స్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ ను ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ అని కూడా పిలుస్తారు. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లలో ఒకటి. టోర్నమెంట్ విజేతలకు బంగారు పతకాలు అందజేస్తారు. అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్‌లుగా పరిగణిస్తారు.


మొదటి ప్రపంచ ఛాంపియన్ షిప్ ను 1977, మల్మో(స్వీడన్)లో నిర్వహించారు. మూడేళ్లకు ఒకసారి టోర్నమెంట్ ను నిర్వహించాలని గతంలో భావించారు నిర్వాహకులు. కానీ వారు అనుకున్న విధంగా టోర్నమెంట్ సాగలేదు. IBF, BWF టోర్నమెంట్‌ను నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అయితే 1983లో ఈ ఈవెంట్‌ను రెండు సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించడం మొదలు పెట్టారు. ఇలా 2005 వరకు కొనసాగింది. ఇక 2006లో వారు టోర్నమెంట్‌ను ఏటా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ 27వ ఎడిషన్ జపాన్‌లోని టోక్యోలో ఆగస్టు 22 నుండి 28, 2022 వరకు జరగబోతోంది. ఈ టోర్నమెంట్‌లో 46 దేశాల నుండి మొత్తం 364 మంది అథ్లెట్లు పాల్గొంటారని అంచనా.

2022 BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో, భారతదేశం 27 మంది సభ్యులతో కూడిన జట్టును పంపింది, ఇందులో ఏడుగురు సింగిల్స్ ప్లేయర్‌లు, 10 డబుల్స్ జంటలు బరిలోకి దిగనున్నాయి. ఇంతకుముందు సంవత్సరాల్లో భారత్ 1 స్వర్ణం, 4 రజతాలు, 7 కాంస్యాలతో సహా మొత్తం 12 పతకాలు సాధించింది. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్ పీవీ సింధు. ఈ ఏడాది ఎవరు గెలిచి నిలుస్తారో చూడాలి.


Tags:    

Similar News