2019 లో టైటిల్ సాధించిన సింధు.. ఈసారి మాత్రం

కెనడాకు చెందిన మిచెల్ లీతో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పివి సింధు

Update: 2022-08-17 05:45 GMT

బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు జరిగాయంటే చాలు.. పీవీ సింధు నుండి పతకాన్ని ఆశిస్తారు. 2019 లో సింధు విమెన్స్ సింగిల్స్ టైటిల్ ను సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఏడాది కామన్ వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలిచిన సింధు.. ఇక్కడ కూడా పతకాన్ని సాధిస్తుందని భావించారు. అయితే ఆమె గాయపడడంతో టోర్నమెంట్ కు దూరమవ్వాల్సి వచ్చింది. భారతదేశానికి స్వర్ణం సాధించాలనే కామన్ వెల్త్ గేమ్స్ లో సింధు గాయంతో కూడా మ్యాచ్లు ఆడింది. ఈ ఏడాది బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ కు మాత్రం గాయం కారణంగా దూరమవుతున్నట్లు చెప్పుకొచ్చింది.


మాజీ ఛాంపియన్ PV సింధు బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2022 సమయంలో గాయపడ్డానని తెలిపింది. ఆగస్టు 21 నుండి ప్రారంభమయ్యే BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ 2022 కోసం టోక్యోకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. CWG సమయంలో తన ఎడమ పాదం మీద ఒత్తిడి కారణంగా ఫ్రాక్చర్ అయ్యిందని.. అందుకే BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుండి వైదొలుగుతున్నానని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది."భారత్‌ తరఫున కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించానని, అయితే దురదృష్టవశాత్తూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది" అని సింధు ట్వీట్‌లో పేర్కొంది.

కెనడాకు చెందిన మిచెల్ లీతో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్‌లో పివి సింధు ఎడమ కాలికి గాయంతో ఆడుతూ కనిపించింది. సింధు 21-15, 21-13 స్కోరుతో స్వర్ణ పతకాన్ని గెలిచింది. సింధు క్వార్టర్-ఫైనల్స్‌లో మలేషియాకు చెందిన గోహ్ జిన్ వీతో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా చాలా ఇబ్బందులు పడింది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సింధు కూడా కీలక పాత్ర పోషించింది, ఆమె భారత్‌ కు రజత పతకానికి అందించింది.

కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో త‌న కాలికి గాయ‌మైంద‌ని, దాని కార‌ణంగానే తాను వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్‌న‌కు హాజ‌రు కాలేక‌పోతున్నాన‌ని తెలిపింది. కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో భాగంగా క్వార్ట‌ర్ ఫైన‌ల్స్‌లో త‌న కాలికి గాయ‌మైంద‌ని… అయితే గెలుపే ల‌క్ష్యంగా సాగిన తాను కామ‌న్వెల్త్ నుంచి వైదొల‌గేందుకు సిద్ధ‌ప‌డ‌లేద‌ని సింధు తెలిపింది. ఈ క్ర‌మంలో త‌న కోచ్‌, ఫిజియో, ట్రైన‌ర్‌ల సాయంతో ఎంత దాకా వీల‌యితే అంత‌దాకా పోరాడాల‌నే నిర్ణ‌యించుకున్నాన‌ని తెలిపింది. సెమీస్‌తో పాటు ఫైన‌ల్స్‌లోనూ గాయం కార‌ణంగా భ‌రించ‌లేని నొప్పిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాన‌ని తెలిపింది. ఆ శ్ర‌మ కారణంగానే త‌న‌కు బంగారు పతకం వచ్చిందని తెలిపింది. కామ‌న్వెల్త్ గేమ్స్ ముగియ‌గానే హైద‌రాబాద్‌కు చేరుకున్నానని.. ఆసుప‌త్రికి వెళ్లి ఎంఆర్ఐ చేయించుకున్నాన‌ని సింధు తెలిపింది. ఎడ‌మ పాదంలో చీలిక ఏర్ప‌డిన‌ట్టు వైద్యులు తేల్చార‌ని ఆమె పేర్కొంది. ఈ క్ర‌మంలో కొన్ని వారాల పాటు విశ్రాంతి త‌ప్ప‌నిస‌రి అని వైద్యులు సూచించార‌ని తెలిపింది. ఈ కార‌ణంగానే తాను వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ షిప్‌న‌కు హాజ‌రు కాలేక‌పోతున్నాన‌ని తెలిపింది.



Tags:    

Similar News