27 మంది సభ్యులతో కూడిన భారత బృందం.. ఆకట్టుకునేది ఎవరో..?
ఈ ఏడాది BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ జపాన్‌లోని టోక్యోలో ఆగస్టు 22 నుండి 28
ఈ ఏడాది BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్ జపాన్‌లోని టోక్యోలో ఆగస్టు 22 నుండి 28 వరకు జరగనుంది. 46 దేశాల నుండి మొత్తం 364 మంది అథ్లెట్లు ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఇక జపాన్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. భారతదేశం 27 మంది సభ్యులతో కూడిన జట్టును పంపింది, ఇందులో ఏడుగురు సింగిల్స్ ప్లేయర్‌లు, 10 డబుల్స్ జంటలు బరిలోకి దిగనున్నాయి. ఇక ఈ ఏడాది సత్తా చాటడానికి పలువురు భారత ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఆడబోయే భారత సింగిల్స్ ఆటగాళ్ళు:
పురుషుల సింగిల్స్ - సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణోయ్
మహిళల సింగిల్స్ - మాళవికా బన్సోడే, సైనా నెహ్వాల్.
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఆడబోయే భారత డబుల్స్ ఆటగాళ్ళు:
పురుషుల డబుల్స్ - MR అర్జున్-ధృవ్ కపిల, మను అత్తిరి- బి సమ్మత్, కృష్ణ ప్రసాద్-వృణుష్వర్ధన్ గౌడ్, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి.
మహిళల డబుల్స్ - పూజా దండు-సంజన సంతోష్, అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి, ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్, అశ్విని భట్ కె-శిఖా గౌతమ్.
మిక్స్‌డ్ డబుల్స్ - వెంకట్ గౌరవ్ ప్రసాద్-జుహీ దేవాంగన్, ఇషాన్ భట్నాగర్-తనీషా క్రాస్టో.
2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో భారత షట్లర్లు అద్భుతమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత షట్లర్‌లు మరోసారి తమను తాము నిరూపించుకునే అవకాశం దక్కింది. భారత ఆటగాళ్లు దేశానికి పతకాలు తెచ్చివ్వాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. మెడల్స్ గెలిచే సత్తా పలువురు ఆటగాళ్లకు ఉందని చెబుతూ ఉన్నారు. కొంచెం అదృష్టం కూడా తోడైతే విజయం మనవారి సొంతం.