T20 World Cup 2024 : టీం ఇండియాదే విజయం... ఈ విజయం కోసం కదా పదిహేడేళ్లు చూసింది.. నిరీక్షణ ఫలించిన వేళ

టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను ఓడించింది. ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది

Update: 2024-06-30 02:34 GMT

ఓడిపోతామన్న బాధ చాలాసేపు... ఇలా ఎందుకు మనకే జరుగుతుందన్న ఆవేదన... చేతికి వచ్చిన కప్పు చేజారిపోతుందన్న కసి... ఇలా అనేక రకమైన భావాలు నిన్న రాత్రి మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా కలుగుతుంది. మనకు వరల్డ్ కప్ రాత లేదేమో... అందుకే ఇలా దేవుడు స్క్రిప్ట్ ఇలా రాశాడనుకుంటా.. అంటూ నిట్టూర్చిన వాళ్లు కోట్ల మంది.... కానీ అందరి బాధలను తొలగిస్తూ... అందరి కన్నుల నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని తుడూస్తూ విక్టరీ... అద్భుతమైన విజయం... ఊహించని విక్టరీ... ఇది కదా మనకు కావాల్సింది. ఎన్నాళ్లకు దక్కింది. పదిహేడేళ్లకు కానీ సాకారం కాలేదు. కలగా మారుతుందని భావించిన విజయం కంటి ముందు సాక్షాత్కరిస్తే.. టీవీ చూసేవాళ్లకు మనకే కంటి వెంట నీరు ఆగలేదు.. ఇక ఆడిన వాళ్ల సంగతి చెప్పగలమా.. ఎట్టకేలకు ప్రపంచ కప్ మన సొంతమయింది. ఊహించని విజయం లభించింది. టీం ఇండియా విశ్వవిజేతగా నిలిచింది. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నెలకొన్న బాధ ఒక్క నిమిషంలో హుష్ కాకి అంటూ ఎగిరిపోయింది.

ఊహించని విజయం...
అవును.. ఇది ఊహించని విజయమే... ఎవరూ అనుకోని ఉండరు... చాలా మంది టీవీలు కట్టేసి పడుకున్నారు కూడా... చివర వరకూ వచ్చి చేజారడం మనకు అలవాటుగా మారిపోయిందని నిట్టూర్పులు విడుస్తూ రాత మారదులే అని నిర్వేదంతో నిద్రలోకి జారుకున్న వారు అనేక మంది. కానీ వాళ్లందరికీ తెలియనిది.. ఏంటంటే.. మనదే కప్పు... ఎస్.. మనదే ప్రపంచ కప్.. అవున.. మనోళ్లు గెలిచారు. సౌతాఫ్రికాను ఓడించారు. 24 బాల్స్ లో 26 పరుగులు చేయాల్సిన దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ సాధ్యమయింది. మనోళ్లు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించారు. ఆ కప్పు అందుకున్న క్షణాలు.. ఆ మధురమైన ఘట్టం ఆవిష్క్రతమైన వేళ అసాధ్యం.. సుసాధ్యం చేసిన మన బౌలర్లకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కోరిక ఊరికే పోలేదు. ఇంత వరకూ వచ్చి కప్ తీసుకోకుండా వెనక్కు రావడమేంటి? అనుకున్నారేమో.. సాధించారు.. కల నెరవేర్చారు...
తక్కువ పరుగులే చేసినా...
నిన్న జరిగిన టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాను ఓడించింది. ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. మొదట టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. అలా కదురుకున్నారులే అనుకునే సరికి రోహిత్ అవుట్ అయ్యాడు. రోహిత్ 9 పుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్ అలా వచ్చి క్యాచ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇంకేముంది... మన ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకున్నోళ్లు అనేక మంది ఉన్నారు. ఫైనల్ ఫీవర్ మనోళ్లకు వెంటాడిందని భావించరు. కానీ విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్ కుదురుకున్నాడు. విరాట్ కోహ్లి నిలుచుని 76 పరుగులు చేశాడు. దూకుడు గా ఆడుతున్న అక్షర్ పటేల్ 47 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. తర్వాత వచ్చిన దూబో 27 పరుగులు చేశాడు. మనోళ్లు ఇరవై ఓవర్లలకు ఏడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేశాడు.
చిన్న లక్ష్యానని ఊదేస్తారనుకుంటే...
అయితే దక్షిణాఫ్రికా బ్యాటర్ల ముందు ఇదేమీ పెద్ద స్కోరు కాదు. ఎందుకంటే వారిలో అంతటి హిట్టర్లున్నారు. తొలిసారి ఫైనల్స్ కు వచ్చిన దక్షిణాఫ్రికా విశ్వకప్ ను తీసుకెళ్లేందుకు కసితీరా ఆడుతుందని అంచనా వేశఆరు. అయితే హెండ్రిక్స్ ను నాలుగు పరుగులకే అవుట్ చేశారు. డీకాక్ 39 పరుగులు చేశాసి అవుట్ అయ్యాడు. మార్‌క్రమ్ నాలుగు పరుగులకే అవుట్ కావడంతో ఇక విజయం మనదేనని అనుకున్నాం. కానీ క్లాసెన్ దడిపించాడు. మ్యాచ్ ను దక్షిణాఫ్రికా వైపు మలుపు తిప్పాడు. యాభై రెండు పరుగులు చేశాడు. ఇక ఐదు ఓవర్లలో 30 పరుగులే చేయాల్సి ఉండటంతో సౌతాఫ్రికాదే విజయం అనుకున్నారు.కానీ అప్పుడే అద్భుతం జరిగింది. మిల్లర్ అవుట్. జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా పొదుపుతో ఓవర్లు చేశారు. ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లను చేత బుచ్చుకున్నారు మనోళ్లు. కేవలం 22పరుగులు మాత్రమే ఇచ్చారు. దీంతో ఏడు పరుగుల తేడాతో భారత్ విజయం సాదించింది. అర్షదీప్ రెండు, బుమ్రా రెండు, హార్ధిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి భారత్ కు విజయం అందించారు. మనదే కప్. మనకే సొంతమయింది. నిరీక్షణ ఫలించింది. నీరసం తగ్గింది. హుషారుతో మనోళ్లు మైదానమంతా చిందులేశారు. మనసు హాయిగా ఉంది.



Tags:    

Similar News