T20 World Cup : కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలే..అయినా ఎవరూ ఆపుకోలేకపోయారు.. ఎవరిని చూసినా...?

టీ 20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా మీద విజయం తర్వాత భారత్ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు

Update: 2024-06-30 04:10 GMT

అవును... నిన్నటి టీ 20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో దక్షిణాఫ్రికా మీద విజయం తర్వాత భారత్ ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. అందరి ఆటగాళ్ల కళ్లల్లో కన్నీళ్లు... వాళ్లేమిటి.. చూసేవాళ్లకే ఏడుపు ఆగలేదు. రోమాలు నిక్క బొడుచుకున్నాయి. ఇక ఆడేవారికి ఎంత ఉద్వేగం ఉంటుంది. ఆ క్షణంలో వారు అనుభవించింది రాతల్లో చెప్పలేం కాని.. అందరి కళ్లల్లో నీళ్లు...ఒకరు కాదు... ఇద్దరు కాదు.. కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి అందరి ఆటగాళ్లలో కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఇంతటి భావోద్వేగ క్షణాలు మరెప్పుడైనా చూడాలనుకుంటే మరో రెండేళ్లు వెయిట్ చేయాల్సిందేనేమో. అందుకే నిన్నటి మ్యాచ్ లో మన ఆటగాళ్ల ఆటతీరును శభాష్ అని అనిపించక తప్పదు.

ఓటమి అంచున...
ఓటమి తప్పదనుకున్న సమయంలో నిరాశ పడకుండా పోరాడి ఓడి కప్పును గెలిచారు. భారత్ ప్రతిష్టను అంతర్జాతీయంగా మరింత ఇనుమడింప చేశారు. క్రికెట్ చరిత్రలో ఇంతటి ఘనమైన... ఇంతటి ముఖ్యమైన రోజు మరొకటి ఉండదేమో.. ఎక్కువ మంది అభిమానుల కల నెరవేరిన వేళ భారత్ ఆటగాళ్లు.. చివరి బంతికి గెలుపు అందగానే ఇక ఆగలేదు. కన్నీటి పర్యంతమయ్యారు. రోహిత్ శర్మ అయితే గ్రౌండ్ లో పడుకుని మరీ ఏడ్చేశాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లి కళ్లల్లో నీటి పొరలు కనిపించాయి. గెలిచిన వెంటనే ఫోన్లో వీడియో కాల్ చేసి తన కుమార్తెతో ముద్దులు పెడుతూ తన కళ్లను చూడమన్న మాటలను అందరికీ కంటతడి పెట్టించాయి.
ఒక్కరు కాదు.. అందరూ...
ఇక హైదరాబాదీ ఆటగాడు మహ్మద్ సిరాజ్ అయితే బిగ్గరగా ఏడ్చేశాడు. వరల్డ్ కప్ గెలవడం తన జీవితలో మరిచిపోలేని ఘటన అని చెప్పారు. ఇక హార్ధిక్ పాండ్యాను అయితే అందరూ ఓదార్చాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ హార్ధిక్ పాండ్యా అని చెప్పాలి. చివరి ఓవర్.. చేయాల్సిన పరుగులు తక్కువే.. పదహారు పరుగులు చేయాల్స ఉండటంతో రెండు వికెట్లు తీశాడు. విధ్వంసకరంగా ఆడుతున్న మిల్లర్ ను అవుట్ చేశాడు. మ్యాచ్ ను మలుపు తిప్పి కప్ ను మనకు అందించాడు. అందుకే చివరి బంతికి గెలిచిన వెంటన హార్ఢిక్ పాండ్యా వెక్కి వెక్కి ఏడ్చాడు. ప్లేయర్లందరూ వచ్చి హార్ధిక్ పాండ్యాను తలను నిమురుతూ ఓదార్చారు. నిజమే.. పాండ్యా డెత్ ఓవర్ లో నిజంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఆవేశానికి లోను కాకుండా వేసిన బంతులే మనల్ని విశ్వవిజేతలను చేశాయని చెప్పాలి.




Tags:    

Similar News