భవానీలతో నిండిన ఇంద్రకీలాద్రి
విజయవాడ ఇంద్రకీలాద్రికి ఈరోజు భవానీ మాలలు ధరించిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
విజయవాడ ఇంద్రకీలాద్రికి ఈరోజు భవానీ మాలలు ధరించిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భవానీ దీక్ష పరులు ఈరోజు దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. వేల సంఖ్యలో భవానీ మాల ధరించిన భక్తులు హాజరయ్యారు. దీంతో విజయవాడలోని దుర్గమ్మ సన్నిధి కిటకిటలాడుతుంది. దసరా పండగ రోజు ఈ దీక్షను విరమింప చేస్తారు. ఇరుముడుల దీక్ష విరమణ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భవానీ దీక్షపరులను అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో...
ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే అన్ని విజయాలు సమకూరుతాయన్న విశ్వాసంతో అధిక సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈరోజు రాత్రికి హంస వాహనంపై ఉంచి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది జలవిహారం చేయిస్తారు. కానీ ఈ ఏడాది కృష్ణానదిలో వరద ఉధృతి ఉండటంతో నిలకడకగా ఉన్న తెప్ప మీద అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.