Breaking : చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. వాటిని రద్దు చేయాలంటూ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు

Update: 2024-06-24 12:36 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తూ వాటిలో లోపాలను సరిచేస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాపై భారంపడే ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు రద్దు చేస్తున్నారు.

2.60 లక్షల మందికి...
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు, గ్రామ సచివాలయాల సిబ్బందికి న్యూస్ పేపర్లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. మొత్తం 2.60 లక్షల మందికి నెలకు రెండు వందల రూపాయలు న్యూస్ పేపర్లు కొనుగోలు చేేసేందుకు నాటి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు తాజాగా రద్దు చేశారు. వెంటనే వారికి ఇచ్చే అలవెన్సులను నిలుపుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News