14వ శతాబ్దం శిలాశాసనంపై నందమూరి కుటుంబం పేరు.. ఆశ్యర్యమే కదూ?

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా లోని తణుకులోని కేశవరాయ దేవాలయంలోని మండపంలోని ఒక స్తంభంపై శాసనం వెలుగు చూసింది

Update: 2024-09-06 08:12 GMT

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా లోని తణుకులోని కేశవరాయ దేవాలయంలోని మండపంలోని ఒక స్తంభంపై శాసనం బయటపడింది.1443 శకం ఫిబ్రవరి 24న చెక్కినట్లుగా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఇది తెలుగు భాష లో రాసి ఉంది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమేనని సర్వే ఆఫ్ ఇండియా డైెరెక్టర్ తెలిపారు.

వీరు బహుమతి ఇచ్చినట్లుగా...
నందమూరి కుటుంబానికి చెందిన యెరమ మరియు గాడం గంగయ్య భార్య జనుకు (ప్రస్తుతం తణుకు) వద్ద ఉన్న కేశవరాయ దేవాలయంలోని మండపానికి వాయవ్య (వాయవ్య) స్తంభాన్ని బహుమతిగా అందించినట్లు ఉంది. ఈ శాసనంలో నందమూరి కుటుంబం మరియు తణుకు పేరు ఉందని ఇది ఆసక్తికరమైన విషయమని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ తెలిపారు.


Tags:    

Similar News