Pedda Reddy : నేడు లొంగిపోనున్న పెద్దారెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు లొంగిపోయే అవకాశాలున్నాయి.;

Update: 2024-06-06 08:05 GMT
ketireddy peddareddy, ex mla, jc prabhakar reddy,tadipatri
  • whatsapp icon

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేడు లొంగిపోయే అవకాశాలున్నాయి. పోలింగ్ అనంతరం జరిగిన ఘర్షణల కేసులో ఆయన లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. తాడిపత్రిలో ఎన్నికలు జరిగిన తర్వాత పెద్దయెత్తున అల్లర్లు జరిగాయి. ఈ కేసులో పెద్దారెడ్డితో పాటు 38 మందిపై కేసు నమోదు చేశారు.

సమాచారం ఇచ్చి...
తాను ఈరోజు లొంగిపోతున్నానని ఇప్పటికే ఎస్పీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి సమాచారం ఇచ్చారు. తనతో పాటు 38 మంది అనుచరులతో లొంగిపోనున్నానని పెద్దారెడ్డి తెలిపారు. పోలింగ్ రోజు, తర్వాత జరిగిన అల్లర్లలో ముద్దాయిలుగా పెద్దారెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు. నేడు హైకోర్టులో తీర్పు వచ్చే లోపు పెద్దారెడ్డి లొంగిపోనున్నారని చెబుతున్నారు.


Tags:    

Similar News