ఏపీకి వాయు"గండం"
అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన వాయుగుండం ఈరోజు, రేపట్లో తీరం దాటే అవకాశాలున్నాయి.
అండమాన్ నికోబార్ తీరం వద్ద ఏర్పడిన వాయుగుండం ఈరోజు, రేపట్లో తీరం దాటే అవకాశాలున్నాయి. దీంతో వాతవరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కు హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం తుపానుగా మారే అవకాశముందని, ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఏపీకి అలెర్ట్.....
జవాద్ తుపాను తీరం దాటే సమయంలో నలభై ఐదు నుంచి యాభై కీలోమీటర్ల వరకూ ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది.