ఆంధ్ర లయోలా కాలేజీ ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో జెనిత్రా-2K23
విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో జెనిత్రా
విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో ఆర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో జెనిత్రా(ZENITHRA)-2K23 సందడి మొదలైంది. అక్టోబర్ 4, 5 తేదీల్లో పలు ఈవెంట్స్, కాంపిటీషన్స్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. మొదటి రోజు ఎస్సే రైటింగ్, పోస్టర్ మేకింగ్, క్విజ్, మాక్ పార్లమెంట్, డంబ్ షరాడ్స్ ను నిర్వహించనున్నారు. రెండో రోజు డిబేట్, స్కిట్, మిస్టర్ అండ్ మిసెస్ జెనిత్రా కాంపిటీషన్స్ తో అలరించనున్నారు. ఈ ఈవెంట్స్ కోసం విద్యార్థులు సిద్ధమయ్యారు. విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో కేవలం చదువు విషయంలోనే కాకుండా ఇతర వాటిలో కూడా విద్యార్థులకు శిక్షణలు ఇస్తున్నారు. మాక్ పార్లమెంట్ లాంటి ఈవెంట్స్ ద్వారా యువతలో లీడర్ షిప్ క్వాలిటీలను పెంపొందించే అవకాశం ఉంది. ఇక ఇలాంటి ఈవెంట్స్ లో ఫన్ కూడా తప్పని సరి కాబట్టి డంబ్ షరాడ్స్ లాంటివి ఎలాగూ ఉన్నాయి. ట్యాలెంట్ ను వెలికితీయడానికి స్కిట్స్ కూడా వేయనున్నారు. ఇక ఈవెంట్స్ లో స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కల్పిస్తున్నారు నిర్వాహకులు.
ఎవరిలో ఎలాంటి ట్యాలెంట్ ఉందో ఎవరు మాత్రం ఊహించగలరు చెప్పండి.. అందుకే ఇలాంటి ఈవెంట్స్ చాలా మంది యువత కి ఓ చక్కని వేదికగా మారనున్నాయి. జెనిత్రా సూపర్ సక్సెస్ కోసం విద్యార్థులు, నిర్వాహకులు ఎదురుచూస్తూ ఉన్నారు. తెలుగు పోస్ట్ ఈ ఈవెంట్ కు మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తూ ఉంది.జెనిత్రా ’ కార్యక్రమానికి వస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ,ఈ మీట్ ను సక్సెస్ చేయవలసిందిగా ఈవెంట్ కో- ఆర్డినేటర్స్ Dr Dayakar Head, Department of Political sciences, Dr Movva Srinivasa Reddy, Head, Department of History మరియు Dr Baby Rani, Head, Department of Economics కోరుతున్నారు. వివరాలకోసం కింద ఇవ్వబడిన స్టూడెంట్ కో-ఆర్డినేటర్స్ ను సంప్రదించవచ్చు.