వైసీపీ నేతలూ.. ఎందుకీ డ్రామాలు?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు;

Update: 2022-10-29 08:30 GMT

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. వికేంద్రీకరణ పేరుతో డ్రామాలాడుతున్నారన్నారు. 800 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే శ్రీకాకుళం అభివృద్ధి చెందుతుందన్నారు. ఆ నిధులను తెచ్చే దమ్ము, ధైర్యం, దమ్ము స్పీకర్ తమ్మినేని సీతారాంకు, మంత్రి ధర్మాన ప్రసాదరావులకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతులు సిక్కోలు వరకూ వస్తే ఏంటని ఆయన అన్నారు. పాదయాత్ర పై దాడి చేయడం సరికాదని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.

రైతులపై అక్కసుతోనే...
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో జరిగే పనులకు రాష్ట్ర ప్రభుత్వం తన పేరు పెట్టుకుట్టుందని సోము వీర్రాజు విమర్శించారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందన్నారు. అక్కడి రైతులపై అక్కసుతోనే వికేంద్రీకరణ జపం చేస్తున్నారని అన్నారు. జగనన్న కాలనీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని, ఆ పేరును తీసేయకపోతే నిధులను ఆపేస్తామని సోము వీర్రాజు హెచ్చరించారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి అధికారంలోకి రావాలనుకునే ప్రయత్నాలు నెరవేరవని ఆయన అన్నారు.


Tags:    

Similar News