Tiruamala : తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు ఎలా ఉందంటే?

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. చాలా తక్కువగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది.;

Update: 2025-01-06 03:08 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా లేదు. చాలా తక్కువగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. ధనుర్మాసంలో తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ధనుర్మాసంలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకుంటే తమ కష్టాలు తీరతాయని భక్తులు విశ్వసిస్తారు. తిరుమలను సందర్శించుకోవడానికి ఈ నెల ఎంతో మంచిదని పండితులు కూడా చెబుతుండటంతో ఈ సీజన్ లో ఎక్కువ మంది భక్తులు తరలి వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగా అంచనా వేసి అన్ని ఏర్పాట్లను చేశారు. దర్శనం కూడా సులువుగా భక్తులు సందర్శించేందుకు వీలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత మూడు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు.శని,ఆదివారాలు కూడా భక్తులు తిరుమలకు అత్యంత తక్కువ సంఖ్యలోనే రావడంతో అధికారుల కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల వీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. నిత్యం భక్తుల రద్దీతో కళకళలాడే అన్నదాన సత్రం వద్ద కూడా భక్తుల రద్దీ పెద్దగా లేదు. అలాగే లడ్డూ కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ తక్కువగానే ఉండటంతో వాటి తయారీ సంఖ్యను కూడా టీటీడీ తగ్గించినట్లు తెలిసింది. అయితే లడ్డూలను ఇతర ప్రాంతాలకు పంపడానికి కూడా తయారు చేస్తుండటంతో స్వల్ప సంఖ్యలోనే లడ్డూల తయారీ తగ్గించామని అధికారులు చెబుతున్నారు.

9 గంటల దర్శనం...
తిరుమలలో సోమవారం సహజంగా భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. అయితే ఈ నెల 10 వతేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుండటంతో అప్పట నుంచి రద్దీ పెరుగుతుంది. దీనికి సంబంధించి టిక్కెట్లు కూడా ఆన్ లైన్ లో హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఈనెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు లేకుండా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.భక్తులు కంపార్ట్ మెంట్ లో వేచి ఉండకుండానే నేరుగా దర్శనం చేసుకునే వీలు కలుగుతుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఈరోజు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం9 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయంపడుుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకుపైగానే సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,561 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,647 మందిభక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.98
కోట్లు 
రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


 


Tags:    

Similar News