Leopard : శ్రీశైలంలో ఆ ఇంట్లో చిరుత పులి.. కంగారు కాక మరేంటి?

శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. ఒక ఇంట్లోకి ప్రవేశించిన పులి అక్కడే తిరుగుతుండటం సీసీ కెమెరాల్లో కనపడింది.;

Update: 2025-01-06 03:51 GMT

ఇటీవల కాలంలో చిరుత పులులు అడవులను వదిలి జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ బయట మాత్రమే సంచరించే చిరుత పులులు ఇప్పుడు ఏకంగా ఇంట్లోకి వస్తుండటంతో జనాలు కలవరపడుతున్నారు. శ్రీశైలంలో చిరుతపులి కలకలం రేపింది. ఒక ఇంట్లోకి ప్రవేశించిన పులి అక్కడే తిరుగుతుండటం సీసీ కెమెరాల్లో కనపడింది.

పూజారి ఇంట్లో...
శ్రీశైలంలో చిరుత పులి కలవరపెడుతోంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లో అర్ధరాత్రి చిరుత సంచరించడం కలకలం రేపింది. రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను ఉదయాన్నే చూసిన పూజారి కుటుంబం షాక్ కు లోనైంది. కొద్ది రోజులుగా శ్రీశైలం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని స్థానికులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వచ్చి అక్కడ పుటేజీని పరిశీలించి ఎవరూ రాత్రి వేళ బయటకు రావద్దని హెచ్చరించారు.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News