నేడు పేర్ని నాని ముందస్తు బెయిల్ పై?

నేడు పేర్నినాని ముందస్తు బెయిల్‌పై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది;

Update: 2025-01-06 04:02 GMT

నేడు పేర్నినాని ముందస్తు బెయిల్‌పై న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానిహైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు. నేటి వరకూ ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే నేటితోముందస్తు బెయిల్ గడువు పూర్తికావడంతో ఆయనపై చర్యలకు అధికారులు దిగుతారన్న ప్రచారం జరుగుతుంది.

గడువు ముగియనుండటంతో...
మరొకవైపు నేటితో ముందస్తు బెయిల్‌ గడువు ముగుస్తుండటంతో పేర్ని నాని విషయంలో అధికారులు ఏంచేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నేడు జరిగే విచారణలో పేర్ని నానికి ఊరట లభిస్తుందా? లేక అరెస్ట్ కు అవకాశం కల్పిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.



ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

 


Tags:    

Similar News