Arogyasri : ఏపీలో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల బంద్
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు కార్పొరేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది;
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు కార్పొరేట్ ఆసుపత్రుల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఆరో్గ్యశ్రీకి సంబంధించి సేవలను నిలిపేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ తెలిపింది. ఓపీని కూడా నిలిపేయాలని కూడా నిశ్చయించింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయాలని హాస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
26 నుంచి అత్యవసరసేవలు కూడా...
తమకు చెల్లించాల్సిన మూడు వేల కోట్ల రూపాయల బకాయీలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీ నుంచి అత్యవసర సేవలను కూడా నిలిపేస్తామని ప్రకటించింది. ఆసపత్రుల అసోసియేషన్ అల్టిమేటంతో ప్రభుత్వం ఎలా స్పందింస్తున్నది చూడాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం ఆరో్గ్య శ్రీ స్థానంలో బీమా సౌకర్యం అందుబాటులోకి తేవాలన్న యోచనలో ఉన్నసంగతి తెలిసిందే.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now