వైసీపీపై వీర్రాజు ఫైర్
ఆంధప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు;
ఆంధప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తుందని సోము పేర్కొన్నారు. ఆయన ఒక వీడియో విడుదల చేశారు. గుంటూరు లో అగ్రహారం పేరు రాత్రి కి రాత్రి ఫాతిమా పేరుతో బోర్డు పెట్టడం వెనక ఉద్దేశ్యమేంటని సోము ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పేర్లు మార్చడం వెనక...
విశాఖ నగరంలో సీతమ్మ కొండ పేరు మార్చడం, ప్రొద్దుటూరు లో టిప్పుసుల్తాన్ విగ్రహం పెట్టాలని ప్రయత్నం చేయడం వంటి ఘటనల వెనక ఎవరు ఉన్నారో చెప్పాలంటూ సోము వీర్రాజు నిలదీశారు. ముస్లింల ఓట్ల కోసం చట్టాలు మారుస్తామని ప్రకటిస్తున్నారని, అదేవిధంగా హిందూ ఎస్సీ లకు వ్యతిరేకంగా ప్రభుత్వ పోకడలు చూస్తే హిందువుల పై దాడులకు తెగబడే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.