Ap Cabinet : ఏపీ కెబినెట్ కీలక నిర్ణయం.. వారందరికీ ఉచిత విద్యుత్తు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశమయింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది;

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశమయింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా వివిధ అంశాలపై మంత్రి వర్గ సమావేశం చర్చించింది.
కొన్ని కీలక నిర్ణయాలకు...
చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత కరెంట్, నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేట్ వర్సిటీ హోదా, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.వైఎస్సార్ తాడిగడప మునిస్పాలిటీ పేరు ఇకపై తాడిగడప మునిస్పాలిటీగా పేరు మార్పునకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది.