Tirumala Laddu : తిరుమల లడ్డూపై మరోసారి హాట్ కామెంట్ చేసిన చంద్రబాబు

వెంకటేశ్వరస్వామి చేసిన తప్పులకు ఎప్పటికప్పుడు అకౌంట్ సెటిల్ చేస్తుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Update: 2024-09-22 14:08 GMT

వెంకటేశ్వరస్వామి చేసిన తప్పులకు ఎప్పటికప్పుడు అకౌంట్ సెటిల్ చేస్తుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమలలో ఐదేళ్లు అపవిత్రమైన కార్యక్రమాలను చేపట్టారన్నారు. రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారన్నారు. ప్రసాదాల నాణ్యతలోనూ, అన్నదానంలోనూ అపవిత్రంగా వ్యవహరించారని తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు తిరుమల పవిత్రతను కాపాడామని అన్నారు. అన్నదానం కోసం రెండు వేల కార్పస్ ఫండ్ ఉందని చంద్రబాబు తెలిపారు. పవిత్రమైన భావంతో వెంకటేశ్వరస్వామికి ఇచ్చే దాతలు కూడా ఇస్తారన్నారు. లడ్డూ నుంచి జిలేబి, వడ, పొంగల్ కానీ నాణ్యత ఉంటుందన్నారు. అదొక మంచి అనుభూతిని తనకు ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. సుప్రభాత దర్శనానికి వెళితే వైకుంఠం ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు.

మూడు వందల ఏళ్ల నుంచి...
మూడు వందల ఏళ్ల నుంచి లడ్డూ తయారవుతుందన్నారు. అలాంటి తిరుమల కొండపై తన బంధువులను నియమించారన్నారు. తిరుమల లడ్డూ తరహాలో ఎందరో తయారు చేయాలని భావించి కుదరక పక్కకు తప్పుకున్నారన్నారు. రివర్స్ టెండర్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా మార్చేశారన్నారు. లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చిందని చంద్రబాబు తెలిపారు. తమ ప్రభుత్వం పెట్టిన అన్ని నిబంధలను మార్చేసి ఇష్టా రాజ్యంగా మార్చేశారని చంద్రబాబు ఆరోపించారు.టిక్కెట్లను కూడా ఇష్టానుసారం అమ్మేసుకున్నారని తెలిపారు. రివర్స్ టెండరింగ్ వల్ల పెద్ద పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయని చంద్రబాబు అన్నారు. అనుభవం లేని వాళ్లు వచ్చారన్నారు. దీనివల్ల నెయ్యిలో కల్తీ జరిగిందని తెలిపారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని అన్నారు.
తక్కువ ధరకు కొనుగోలు చేసి...
319.90 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. 12 జూన్ 2024 నాటి నుంచి సప్లయ్ చేయడం మొదలుపెట్టారన్నారు. నాలుగు ట్యాంకర్లను విశ్లేషించి నాసిరకం అని తేలడంతో తిప్పి పంపారన్నారు. తాను ఈవో గా శ్యామలరావును నియమించినప్పుడు ఒకటే చెప్పానని, తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టాలని సూచించారన్నారు. అన్ని రకాలుగా తిరుమలలో చర్యలు ప్రారంభించి గాడినపెడుతున్నామన్నారు. తాము హెచ్చరించినా ఆ కంపెనీలు వినలేదన్నారు. భయం, భక్తి లేకుండా వ్యవహరించారన్నారు. అందుకే మూడు రోజుల్లో లడ్డూనే చెడిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు తెలిపారు. అప్పుడే అనుమానం వచ్చిందని అన్నారు. ఆ భగవంతుడు ఇచ్చిన ఆదేశాలనే ఈవోకు చెప్పానని చంద్రబాబు తెలిపారు.


Tags:    

Similar News