నేడు ప్రకాశం జిల్లాకు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణగోపాల్ కుమారుడి వివాహ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు. వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు దర్శి పట్టణానికి చేరుకుంటారు. అక్కడ వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు.
విజయవాడలోనూ...
అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. సాయంత్రం విజయవాడలో జరగనున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో సాయంత్రం 5.30 గంటలకు ఏ ప్లస్ కన్వెన్షన్ లో జరుగుతాయి. అందులో జగన్ పాల్గొంటారు. జగన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.