వైసీపీ పై సెటైర్లు వేసిన పవన్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు.;

Update: 2024-06-22 07:12 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు పదవీ బాధ్యతలను స్వీకరించిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం పదకొండు సీట్లను మాత్రమే కట్టబెట్టారన్నారు. అయితే ఈరోజు ముఖ్యమైన ఘట్టానికి వైసీపీ నేతలు హాజరు కాలేదన్నారు.

విజయాన్ని ఆనందంగా...
విజయాన్ని ఆనందంగా తీసుకున్న వైసీపీ నేతలు ఓటమిని కూడా అదే విధంగా తీసుకునే ధైర్యం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే సభ నుంచి పారిపోయారని పవన్ కల్యాణ్ అన్నారు. గెలుపు ఎలాగ ఆస్వాదించారో ఓటమిని కూడా అలాగే తీసుకుని ప్రజాసమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం పారిపోయిందని ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News