Andhra Pradesh : సోమవారం నుంచి ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆరోజు నుంచి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. 8వ తేదీ నుంచి ఉచితంగా ఇసుకను అందచేయనుంది

Update: 2024-07-04 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక విక్రయాల పై ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని నిర్ణయించింది. ఇకపై టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. అదీ రవాణా ఛార్జీల కోసమే వసూలు చేయనున్నారు. వసూలయిన మొత్తం స్థానిక సంస్థలకే దక్కుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మొన్నటి వరకూ ఇసుక టన్నుకు 475 రూపాయలు వసూలు చేసేవారు. కాంట్రాక్టర్ల తవ్వకాలు, రవాణాఖర్చులు వందల రూపాయలు తీసేయగా, 375 రూపాయలు టన్నుకు ప్రభుత్వ ఖజానాకు చేరేది.

స్థానిక సంస్థలకు...
అయితే ఇకపై 88 రూపాయలు రవాణా ఛార్జీలు స్థానిక సంస్థలకే చెందుతాయి. రవాణా ఛార్జీల కింద వసూలు చేసే 88 రూపాయల్లో 66 రూపాయలు స్థానిక సంస్థలకు, జిల్లా ఖనిజ నిధి కింద 19.80 రూపాయలు, గనుశాఖలో ఖనిజాన్వేషణ ట్రస్ట్ కు 1.32 రూపాయలు చేరుతుందని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొన్నారు. రవాణా ఛార్జిలను జిల్లా కలెక్టర్లు నిర్ణయించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎటువంటి ఆన్ లైన్ పర్మిట్లు లేకుండా సెప్టంబరు వరకూ ఇసుక విక్రయించనున్నారు. అక్టోబర్ నుంచి కొత్తగా పర్మిట్లు జారీ చేసి, ఆన్ లైన్ లోనే చెల్లింపులు తీసుకురానున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో భవన నిర్మాణాలు ఊపందుకుంటాయని, నిర్మాణ రంగ కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.


Tags:    

Similar News