తెలంగాణపై కోర్టు థిక్కరణ పిటీషన్ ..ఏపీ సర్కార్ నిర్ణయం
తెలుగు అకాడమీ విభజనపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.
తెలుగు అకాడమీ విభజనపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. గతంలో తెలుగు అకాడమీని విభజించాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోవడం లేదని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. గత ఏడాది ఃసెప్టంబరు 14వ తేదీనే తెలుగుద అకాడమీని విభజించాలని సుప్రీకంోర్టు ఆదేశించింది. అయితే తెలుగు అకాడమీలో 65 కోట్ల కుంభకోణం జరగడంతో విభజన ప్రక్రియ నిలిచిపోయింది.
మరోసారి పిటీషన్....
విభజనలో జాప్యం పై ఏపీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా తెలంగాణ ప్రభుతం బేఖాతరు చేస్తుదందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టు థిక్కరణ పిటీషన్ వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విభజన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించినా పట్టించుకోలేదని పిటీషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొననుంది.