Tiruamala : తిరుమలలో ఖాళీగానే కంపార్ట్ మెంట్లు.. దర్శన సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఈరోజు మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు

Update: 2024-11-19 04:34 GMT

తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఈరోజు మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. భక్తులు పెద్దగా లేకపోవడంతో తిరుమలకు చేరుకున్నభక్తులు నేడు వెంకటేశ్వరస్వామిని సులువుగా దర్శనం చేసుకుంటున్నారు. పెద్దగా కంపార్ట్ మెంట్లలో వేచి ఉండకుండానే దర్శనం చేసుకుంటున్నారు. సహజంగా సోమవారం నుంచి గురువారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంటుంది. తిరిగి శుక్రవారం నుంచి రద్దీ ఎక్కువగా ఉంటుంది. మూడు రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని ముందుగానే అంచనా వేసుకుని అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు చేస్తుంటారు. ముందుగా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు తిరుమలకు చేరుకుని స్వామి వారికి మొక్కులు తీర్చుకుంటారు. సహజంగా శనివారం ఏడుకొండలవాడిని దర్శించుకుంటే మంచిదని ఎక్కువ మంది విశ్వసిస్తారు.

వీకెండ్ లోనే ఎక్కువగా…

అందుకే వీకెండ్ లోనే ఎక్కువగా భక్తులు తిరుమలకు వస్తుంటారు.మిగిలిన రోజుల్లో మాత్రం స్థానికంగా ఉండే ప్రజలు తిరుమల వెంకేటేశ్వరుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు.ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల్లో లభిస్తుంది. టైమ్ స్లాట్ దర్శనం భక్తులు కూడా ఒక కాంపార్ట్ మెంట్ లోనే వేచి ఉన్నారు. వీరికిదర్శన సమయం రెండు గంటలు పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,085 మంది భక్తులు దర్శించుకున్నారు.వీరిలో 21,385 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.



Tags:    

Similar News