ఏపీకి తుపాను ముప్పు.. వర్షాలు తప్పవు
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. గంటల్లో మరో వాయుగుండం ఉంది.
ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉంది. గంటల్లో మరో వాయుగుండం ఉంది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ అంతటా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా తీరానికి దగ్గరలో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతాలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.
వాయుగుండంగా మారి...
అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా వచ్చే గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏపీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోసారి వాయుగుండం ప్రజలను మరింతగా భయపెడుతుంది.