రోగులు మరణిస్తే ఎవరు బాధ్యులు...? హెల్త్ ఉద్యోగుల సమావేశం
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎన్జీవో కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎన్జీవో కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉద్యమ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ఎస్మాను ప్రభుత్వం ముందుగా ప్రయోగిస్తే వైద్య ఆరోగ్యశాఖ మీదనే ప్రయోగిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుతముున్న పరిస్థితుల్లో సమ్మెకు వెళితే ప్రభుత్వం పూర్తిగా ఇరకాటంలో పడుతుంది. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై ఈ సమావేశంలో చర్చలు జరుపుతున్నారు.
ఎస్మాను ప్రయోగించినా.....
ఒకవేళ ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి మిగిలిన ఉద్యోగులతో పాటు సమ్మెలోకి వెళితే అత్యవసర సేవలు అందక రోగులు మరణిస్తే ఆ నెపాన్ని తమపై నెడతారని భావిస్తున్నారు. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన శాఖ ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమ్మెలోకి దిగితే తొలుత ఇబ్బంది పడేది ప్రజలే. ఎస్మాను కూడా తొలుత ఈ శాఖ మీదనే ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అందుకే ఏడో తేదీ కాకుండా దశల వారీగా ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించున్నారు. కార్యాచరణను ప్రకటించనున్నారు.