Lokesh : నేడు విశాఖకు నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. మోదీ పర్యటన ఏర్పాట్లపై ఆయన సమీక్ష చేయనున్నారు;
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష చేయనున్నారు. పోలీసు అధికారులతో పాటు పార్టీ నేతలతో కూడా లోకేష్ సమావేశం కానున్నారు. ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడానికి లోకేష్ విశాఖకు వస్తున్నారు.
రోడ్ షోకు సంబంధించి...
ప్రధాని విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి శంకుస్థాపన చేయడమే కాకుండా విశాఖపట్నంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధానితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభలో కూడా ప్రధాని పాల్గొననుండటంతో అందుకు తగినట్లుగా జనసమీకరణ చేయాలని లోకేష్ నేతలను ఆదేశించనున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now