ఏపీకి భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు కురియనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ వర్షాలు కురియనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం నాటికే అల్పపీడనం మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రేపటి నుంచి...
దీంతో రేపటి నుంచి 22వ తేదీ వరకూ ఏపీ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ల రాదని అధికారులు వెల్లడించారు.