వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఇక ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాటల యుద్దాలకు దిగేందుకకు సిద్ధమవుతున్నారు..
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటనేదే ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలను బహిష్కించినట్లుగానే ఈసారి కూడా బైకాట్ చేయడం ఖాయం అని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల హీట్ కొనసాగుతున్న ఈ సమయంలో సమావేశాలు జరగనుండటం.. రాజధాని అంశంపై టీడీపీ పట్టుపట్టే అవకాశం ఉంది. మరి ఈ సారి సమావేశాలను బహిష్కరిస్తారా..? లేదా సజావుగా సాగేందుకు సహకరిస్తారా...? అన్నది వేచి చూడాలి.ఇక ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మాటల యుద్దాలకు దిగేందుకు సిద్ధమవుతున్నారు నేతలు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ నెలలో మూడో వారంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సెప్టెంబర్ సెకండ్ వీక్‌లో సమావేశాలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ సీఎం జగన్ లండన్ పర్యటన నేపథ్యంలో సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. సీఎం విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాతే మంత్రి వర్గ సమావేశం నిర్వహించి సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగేందుకు రెడీ అవుతున్నాయి. వచ్చే నెల18 లేదా 20వ తేదీ నుంచి సమావేశాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే సమావేశాలు వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు సీఎం జగన్ అధ్యక్షతన వహిస్తారు. ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చించనున్నారు. రాబోయే నెలలో కానీ ఆ తర్వాత వచ్చే నెలలో సీఎం క్యాంప్ కార్యాలయం విశాఖకు తరలింపు ఉండవచ్చని ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీలో దీనికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.
అయితే వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలున్నందున ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే సభలో లేవనెత్తే అంశాలపై రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో నకిలీ ఓట్ల అంశంపై కూడా రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈ సమావేశంలో సభలో రభసా మరింతగా జరిగే అవకాశం కనిపిస్తోంది.