Ys Sharmila : నేడు ఇడుపులపాయకు షర్మిల

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల నేడు ఇడుపులపాయకు వెళ్లనున్నారు;

Update: 2024-01-20 02:43 GMT
Ys Sharmila : నేడు ఇడుపులపాయకు షర్మిల
  • whatsapp icon

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల నేడు ఇడుపులపాయకు వెళ్లనున్నారు. అక్కడ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ఈరోజు మద్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకోనున్నారు.

రేపు పీసీసీ చీఫ్ గా...
సాయంత్రం నాలుగు గంటలకు వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించనున్నారు. ఈోజు రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. రేపు విమానంలో విజయవాడకు బయలుదేరి షర్మిల వెళతారు. రేపు ఉదయం పదకొండు గంటలకు పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టనున్నారు. దీంతో రేపటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News