Andhra : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యాశాఖలో అమలు చేస్తున్న పథకాల కోసం టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేసింది
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం విద్యాశాఖలో అమలు చేస్తున్న పథకాల కోసం టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమాలపై ఈ నెంబరుకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సూచించింది. టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిిర్యాదు చేస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని చెప్పింది.
విద్యాసంస్థల్లో....
ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం భోజనం, మెనూ అమలు, మరుగుదొడ్ల నిర్వహణ, ఉపాధ్యాయుల గైర్హాజరు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు వంటి వాటిపై ఈ నెంబరు ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారా చర్యలు తీసుకుంటామని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఇందుకోసం 14417 నెంబరుకు ఫోన్ చేయాలని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.