నేటి నుంచి ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు

ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండగకు స్పెషల్ బస్సులు నేటి నుంచి నడపనుంది. ఈసారి ఛార్జీలుపెంచలేదని ఆర్టీసీ అధికారులు చెప్పారు.

Update: 2023-01-06 03:13 GMT

ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండగకు స్పెషల్ బస్సులు నేటి నుంచి నడపనుంది. ఈసారి ఛార్జీలు ఏమాత్రం పెంచలేదని ఆర్టీసీ అధికారులు చెప్పారు. గత ఏడాది యాభై శాతం ఛార్జీల ధరలను పెంచినా, ఈ ఏడాది మాత్రం ధరలను ఏమాత్రం పెంచకుండానే స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశారు. పైగా స్పెషల్ బస్సుల్లో ఐదు నుంచి ఇరవై శాతం వరకూ రాయితీ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాను పోను రిజర్వ్ చేసుకుంటే పది, నలుగురికి మించి కుటుంబసభ్యులు అందరూ ఒకేసారి ప్రయాణిస్తే ఐదు శాతం రాయితీని ఇస్తారు.

రాయితీలతో...
అలాగే వాలెట్ ద్వారా టిక్కెట్లను కోనుగోలు చేస్తే ఐదుశాతం, వృద్ధుల ఛార్జీల్లో 25 శాతం రాయితీలను ప్రకటిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి కోసం ఏపీఎస్ ఆర్టీసీ మొత్తం 3,120 బస్సులను ఏర్పాటు చేసింది. పండగ పూర్తయిన తర్వాత తిరిగి చేరుకునేందుకు 3,280 బస్సులను నడపనుంది. సొంతూళ్లకు పండగకు వెళ్లిన ప్రజల సౌకర్యార్థం ఈ నెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.


Tags:    

Similar News