అసెంబ్లీ ఘటనపై భువనేశ్వరి తొలి స్పందన ఇలా

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తొలిసారి స్పందించారు.;

Update: 2021-11-26 06:26 GMT
bhuvaneswari, chandrababu, assembly, andhra pradesh
  • whatsapp icon

ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తొలిసారి స్పందించారు. ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. తనకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగకూడదని భువనేశ్వరి ఆకాంక్షించారు. ఏపీ శాసనసభలో తనపై అనునచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేసిన వారందరికీ భువనేశ్వరి లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నటికీ మరచిపోలేను....
ప్రజలు చూపిన అభిమానాన్ని తాను ఎన్నటికీ మరిచిపోలేనని భువనేశ్వరి తెలిపారు. చిన్నతనం నుంచి తన అమ్మ, నాన్న విలువలతో పెంచారని భువనేశ్వరి చెప్పారు. నేటికీ ఆ విలువలను పాటిస్తున్నామని చెప్పారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడాలని ఆమె పిలుపునిచ్చారు.


Tags:    

Similar News